తెలంగాణ సంస్కృతికి ప్రతిక బతుకమ్మ
ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి
కాకతీయ, నెల్లికుదురు: ప్రాథమికోన్నత పాఠశాల నరసింహుల గూడెంలో విద్యార్థినీ ,విద్యార్థులతో ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మలు పేర్చిన అనంతరం ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి మాట్లాడుతూ తెలంగాణలో పూలను బతుకమ్మ గా పేర్చి పూజించడం , ప్రకృతిని దైవంగా భావించడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత అలాగే తెలంగాణ ఆడపడుచులు అంతా కలిసి సంతోషంగా నిర్వహించుకునే వేడుక బతుకమ్మ అని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత రేపటి తరమైన నేటి విద్యార్థులుదని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు సిహెచ్. హరినాథ్, బి. శ్రీనివాస్, టి. సుకన్య, సిహెచ్ . రమేష్, ఎస్ .వీరేందర్, సంగ శ్రీనివాస్, ఎస్.కె.సయ్యద్, ఏ. మమత పాల్గొన్నారు.

