నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన
కాకతీయ, ఖమ్మం : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11.15 గంటలకు ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు అశ్వారావుపేట మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్–20 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారు. ఈ వివరాలను మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

