epaper
Sunday, October 18, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతుల సొమ్ము రూ.80 కోట్లు గోల్‌మాల్‌!

రైతుల సొమ్ము రూ.80 కోట్లు గోల్‌మాల్‌!
మాజీ జేడీఎం శ్రీనివాస్‌ ఆస్తులపై ఏసీబీ విచారణకు డిమాండ్‌
రైతులకు జరిగిన నష్టంపై సమగ్ర దర్యాప్తు జరపాలి
రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డికి తెలంగాణ రైతు సంఘం ఫిర్యాదు

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు అందాల్సిన సుమారు రూ.80 కోట్ల సొమ్ము దుర్వినియోగమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ మోర్తాల చందర్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్‌ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖతో విచారణ జరిపించాలని, ఆయనను ఉద్యోగం నుంచి పూర్తిస్థాయిలో తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ కోదండరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

27 ఏళ్లు వరంగల్‌ రీజియన్‌లోనే

1996లో సీనియర్‌ మార్కెటింగ్‌ అధికారిగా ఆదిలాబాద్‌లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఉప్పుల శ్రీనివాస్‌.. 30 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు మినహా 27 ఏళ్లు వరంగల్‌ రీజియన్‌ పరిధిలోనే పనిచేశారని చందర్‌రావు ఆరోపించారు. పై అధికారులు, ప్రభుత్వ పెద్దలను తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేసుకుంటూ వ్యవహరించారని విమర్శించారు. ఎక్కడ పనిచేసినా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌పై తన ప్రభావం కొనసాగించారని పేర్కొన్నారు. 2012 నుంచి 2023 ఏప్రిల్‌ వరకు వరంగల్‌ మార్కెట్‌లో రైతుల గన్నీ సంచులకు వ్యాపారులు చెల్లించాల్సిన ఛార్జీలు రూ.50–60 కోట్లు, దడవాయి ఛార్జీలు మరో రూ.10 కోట్లు, భారత పత్తి సంస్థ 2012–13, 2014–15లో కొనుగోలు చేసిన 31,94,000 గన్నీలకు సంబంధించి సుమారు రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.80 కోట్ల మేర రైతులు నష్టపోయారని చందర్‌రావు ఆరోపించారు. ఈ మొత్తం వ్యాపారులకు లబ్ధి చేకూర్చిందని, ఇందుకు శ్రీనివాస్‌ సహకరించారని పేర్కొన్నారు.
రైతుల గన్నీ సంచులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని రైతు సంఘం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఈ కేసును సాకుగా చూపి మార్కెట్‌లోని మూడు గోదాముల్లో 5 లక్షల గన్నీలు ఉన్నాయంటూ గత 13 ఏళ్లుగా తాళాలు వేసి ఉంచారని, దీంతో మార్కెట్‌ కమిటీకి సుమారు రూ.2 కోట్ల అద్దె ఆదాయం నష్టం వాటిల్లిందని విమర్శించారు.

బినామీ రైతుల ధ్రువీకరణపై ఆరోపణలు

పత్తి, కౌలు రైతులను ధ్రువీకరించే అధికారాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై, పర్సంటేజీల ప్రాతిపదికన బినామీ రైతులను ధ్రువీకరించారని చందర్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వరంగల్‌ రీజియన్‌లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని పేర్కొంటూ, మాజీ జేడీఎం ఆస్తులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చందర్‌రావు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు పానుగంటి నరసయ్య, నార్ల చంద్రశేఖర్‌, మాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని శ్రీ రామగిరి...

సారే కావాలంటున్నారు..

సారే కావాలంటున్నారు.. కేసీఆరే మ‌ళ్లీ రావాలంటున్నారు.. బీఆర్ఎస్‌ నాయకత్వాన్నే తెలంగాణ కోరుకుంటోంది మూడేళ్లలో తెలంగాణకు కాంగ్రెస్‌...

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!

పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి! ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ...

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి

గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలి దసరా వివాదానికి చట్టప్రకారం పరిష్కారం చూపాలి రాంపురం సర్పంచ్‌ రడం...

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం ప్రజల కోసం పోరాడినవారు గుండెల్లో నిలిచిపోతారు హైకోర్టు...

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్!

నంబర్ ప్లేట్ లేదు.. దర్పం మాత్రం ఫుల్! జిల్లా యూత్‌ ప్రెసిడెంట్‌ బోర్డుతో...

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు

బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో...

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత

అష్టలక్ష్మి అవతారంలో దుర్గామాత కాకతీయ, దుగ్గొండి: మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.