epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు!

తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక మలుపు!
నేపాల్‌లో ప్రధాన నిందితురాలి ఆచూకీ
విశ్రాంత ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో పోలీసుల పురోగతి
దోచుకున్న నగలు, కుట్ర వెనుక ఇతరుల పాత్రపై దర్యాప్తు
ఆరు నెలలుగా కొన‌సాగుతున్న‌ గాలింపు చ‌ర్య‌లు

కాకతీయ, హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌ నగర్‌లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజ రంజన్‌ హత్య కేసులో కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఆరు నెలలుగా గాలిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని నేపాల్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2026 మే 7 అర్ధరాత్రి తర్వాత తనూజపై దాడి జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వినయ్‌ రంజన్‌ రే బెంగళూరులో ఉన్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తనూజ ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం నగలు, నగదు, విలువైన వస్తువులతో నిందితులు పరారయ్యారు. కుటుంబ సంరక్షకురాలిగా పనిచేసేందుకు వచ్చిన నేపాల్‌కు చెందిన కల్పన, ఇతర నిందితులతో కలిసి దోపిడీ పథకంలో భాగంగా హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేరం అనంతరం నిందితులు బీహార్‌ సరిహద్దుల మీదుగా నేపాల్‌కు చేరుకున్నట్లు భావిస్తున్నారు. కల్పన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రెండు నెలలపాటు నేపాల్‌లో మకాం వేసి గాలించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇద్దరి అరెస్టు

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిలో సునీల్‌ బహదూర్‌ ఔజీపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకుని జైలుకు తరలించినట్లు సమాచారం. ఇంట్లోని వ్యక్తుల కదలికలు, కుటుంబ సభ్యుల సమయాలను గమనించి అదును చూసి నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంపై కొందరు సిబ్బందికి ఛార్జిమెమోలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు కల్పనను విచారిస్తే హత్యకు సంబంధించిన పూర్తి కుట్ర, ఇతర నిందితుల పాత్ర, దోచుకున్న నగలు ఎక్కడికి చేరాయనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్‌ వంటి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో నగరంలో సంచలనం సృష్టించింది. నిందితులందరినీ పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌!

తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్‌! జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం...

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!

34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు! భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం రీ-సర్వేతో సాగుదారులకు...

జూకు పోటెత్తిన సందర్శకులు

జూకు పోటెత్తిన సందర్శకులు ఒక్కరోజే 20,483 మంది సందర్శన రైళ్లు, సఫారీ సేవలకు అదనపు...

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి!

హైడ్రా చెరువుల చెంత బతుకమ్మ సందడి! అభివృద్ధి చేసిన చెరువుల వద్ద మహిళల...

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు...

పండుగకు పల్లెబాట..

పండుగకు పల్లెబాట.. హైవేలపై ట్రాఫిక్‌ పాట్లు! చౌటుప్పల్‌, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు...

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక

బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.