epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

ట్రిలియ‌న్ డాల‌ర్ల ప్యాకేజీ

ఎల‌న్ మ‌స్క్‌కు టెస్లా బోర్డు బంపర్ గిఫ్ట్

కార్పొరేట్ చరిత్రలో ప్ర‌పంచ కుబేరుడి రికార్ట్‌

75 శాతం ఓట్లతో షేర్‌హోల్డర్లు మ‌ద్ద‌తు

(కాక‌తీయ‌, అంతర్జాతీయం): ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు చరిత్రలోనే అత్యధిక జీత ప్యాకేజీ ఆమోదించి బంప‌ర్ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. షేర్‌హోల్డర్లు 75 శాతం ఓట్లతో ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. దీంతో మస్క్ జీతం ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. ఒక్క కంపెనీ సీఈఓకి ఇంత భారీ రివార్డ్ ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇది కేవలం జీతం కాదు.. షేర్ల రూపంలో లభించే రివార్డ్ ప్యాకేజీ. మస్క్ నిర్దిష్ట టార్గెట్లను సాధిస్తే, ఆయనకు లక్షల సంఖ్యలో షేర్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ సుమారు 1.4 ట్రిలియన్ డాలర్లు. మ‌స్క్‌కు ట్రిలియ‌న్ డాల‌ర్ల పే ప్యాకేజీ అందాలంటే ఆయ‌న‌ ముందున్న సవాల్ చాలా పెద్ద‌ది.. ఆ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుంది. ఇది సాధిస్తే టెస్లా మాత్రమే కాదు, ప్రపంచ కార్పొరేట్ రంగానికే కొత్త ప్రమాణం సెట్ అవుతుంది. టెస్లా నెక్ట్స్ బిగ్ మిషన్.. రోబోట్యాక్సీలు. స్వీయ డ్రైవింగ్ టెక్నాలజీతో వాహనాలను రోడ్డెక్కించడానికి మస్క్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు. లక్షల సంఖ్యలో రోబోట్యాక్సీలు మార్కెట్లోకి వస్తే, టెస్లా విలువ ఆకాశాన్ని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మస్క్‌కు ఇంత భారీ పే ప్యాకేజీ ఇవ్వడం పట్ల కొందరు షేర్‌హోల్డర్లు, ఆర్థిక నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ టెస్లా బోర్డు మాత్రం మస్క్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఆయన లేకుండా టెస్లా అభివృద్ధి ఆగిపోతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్, ఈ పే ప్యాకేజీతో ఆయన ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు..

ప్రతి అమెరికన్‌కి 2వేల డాల‌ర్లు.. ట్రంప్‌ బ్లాస్టింగ్‌ అనౌన్స్‌మెంట్‌! కాక‌తీయ‌, అంతర్జాతీయం : అమెరికా...

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం

ఎన్డీఏ కూటమిదే ఘ‌న విజ‌యం నక్సల్​ రహిత భారత్ వైపు అడుగులు లాలూ, సోనియాకు...

వందేమాతరం స్ఫూర్తిమంత్రం

వందేమాతరం స్ఫూర్తిమంత్రం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది జాతీయతా భావనలను పెంపొందించింది ప్రధాని నరేంద్ర మోదీ ఘ‌నంగా...

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..!

ఇండియ‌న్ స్టూడెంట్స్‌కు కెన‌డా షాక్‌..! (కాక‌తీయ‌, అంతర్జాతీయం): కెనడా ఒకప్పుడు భారత విద్యార్థుల...

Viral Video: ఐక్యరాజ్యసమితిలో హార్ట్-టచ్ చేసిన ముస్లిం లీడర్ .. ‘ఓం శాంతి’ అంటూ సందేశం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఐక్యరాజ్యసమితిలో చేసిన...

Trump: ట్రంప్ తిక్కకుదిరింది.. విదేశీ ఉద్యోగులను నియమించాలని ఆర్డర్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికా పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని...

భారత్ పై ఆంక్షలు సరైన నిర్ణయమే.. జెలెన్ స్కీ హాట్ కామెంట్స్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్ పై...

ఆ యుద్ధాన్ని ఆపడం చాలా సులభం అనుకున్నా: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.