దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన
-విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన
కూలీల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు
కాకతీయ, దుగ్గొండి :దుగ్గొండి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధి కూలీల హాజరు సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాన్ హెచ్చరికల నేపథ్యం లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.కలెక్టర్ పర్యటనలో జడ్పి సీఈఓ వసంత, స్థానిక సర్పంచ్ కామిశెట్టి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ వాజిద్, టెక్నీకల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కలెక్టర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎస్సై మాశిరెడ్డి మహేందర్ భద్రత ఏర్పాట్లు చేశారు.

