వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర…
*నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో మార్మోగిన ఊకల్ పుర వీధులు…
కాకతీయ,గీసుగొండ: ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన నాగసుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి దేవసేన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవరుల ఉత్సవ విగ్రహాలను మల్లెపూలతో అలంకరించిన అశ్వ రథం పై దివ్య రథ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండల దీక్షలు చేపట్టిన స్వాములు, మహిళల కోలాటాల నడుమ గ్రామంలోని పురవీధులలో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కక్కేర్ల సుభాష్,కమిటీ సభ్యులు, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.


