డాక్టర్ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి
గవర్నర్ కోటాలో అవకాశం కల్పించాలని తీర్మానం
60కిపైగా కుల, ప్రజా సంఘాల మద్దతు
కాకతీయ, హనుమకొండ: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని 60కిపైగా కుల, ప్రజా సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన వైద్య, సామాజిక సేవలను గుర్తించాలని కోరారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి గౌడ్, ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ రజక, పాస్టర్లు ఐసాక్, జోసెఫ్, బీసీ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్, సీజేపీ జెన్జి ప్రజ్వల్, న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ పటేల్, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ మాదిగ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మాదాసి సురేష్, బావని రెడ్డి, టీడీపీ నాయకుడు నరేష్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ దాస్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు భిక్షపతి, గంగ నర్సయ్య, శివాజీ, సంధ్య రెడ్డి, కొమ్ముల బాబు, ఎండి అలీ, ఎం.ఆర్.ఓ. సమ్మయ్య, డాక్టర్ రాము, స్వామి, ప్రేమ్, మున్సిపాలిటీ శ్రవణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించారు.

