epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్ల అటాచ్‌మెంట్ పేరుతో మోసం

కార్ల అటాచ్‌మెంట్ పేరుతో మోసం
ఐటీ కంపెనీల్లో భారీ అద్దె ఆశ చూపి వాహనాల తాకట్టు
మోసాల‌కు పాల్ప‌డిన‌ ఇద్దరు అరెస్ట్.. మూడు కార్లు స్వాధీనం

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఐటీ కంపెనీల్లో కార్లను అటాచ్‌మెంట్ ఇప్పిస్తామని, నెలకు భారీ అద్దె వస్తుందని నమ్మించి వాహన యజమానులను మోసం చేసిన ముఠాకు చెందిన ఇద్దరిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు కార్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు సింగారపు శ్యామ్ కుమార్ (ఏ1), ఎం.డి. సోహైల్ (ఏ2) కలిసి, ఐటీ కంపెనీల్లో కార్లు అటాచ్‌మెంట్ ఇప్పిస్తామని, నెలకు రూ.35 వేల వరకు అద్దె వస్తుందని వాహన యజమానులను నమ్మించారు. యజమానుల నుంచి కార్లను తీసుకుని, ప్రారంభంలో నమ్మకం కోసం మొదటి నెల అద్దెను చెల్లించి, ఆ తర్వాత కార్లను ఇతరుల వద్ద తాకట్టు పెట్టేవారు. అద్దె ఇవ్వకుండా, అసలు కార్లను కూడా తిరిగి ఇవ్వకుండా యజమానులను మోసం చేసేవారు.

వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితులు
జూలై 9న తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులు అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా మోసం బయటపడింది. నిందితుల వద్ద ఒక మారుతి డిజైర్ కారును, వారిచ్చిన సమాచారంతో చింతల్ ఫ్లైఓవర్ కింద దాచిపెట్టిన మరో రెండు కార్లను (మారుతి ఎర్టిగా, మారుతి బలెనో) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్యామ్ కుమార్ గతంలో కూడా ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతనిపై చెన్నారావుపేట, ఇంతేజార్‌గంజ్, ఏ.జే. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, డిజిటల్, ఆర్థిక లావాదేవీల ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.