epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
కాంగ్రెస్‌ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
2029లో రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం
పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేసే వారికే గౌరవం
స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాకతీయ, జ‌న‌గామ‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. లింగాల ఘనపూర్‌ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తే 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని కడియం శ్రీహరి అన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. పాత, కొత్త అనే తేడాలు పక్కనపెట్టి పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే వారికే తన వద్ద గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలి

బీఆర్‌ఎస్‌ నాయకులు గతంలో చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి విమర్శించారు. కవిత చేసిన అవినీతి ఆరోపణలకు ముందుగా బీఆర్‌ఎస్‌ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు గానీ, రూ.వెయ్యి కోట్ల నిధులు గానీ ఇవ్వలేదని ఆరోపించారు.

ప్రతి గ్రామానికి రెండు పంటలకు సాగునీరు

లింగాల ఘనపూర్‌ మండలంలోని ప్రతి గ్రామానికి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. జీడికల్‌ రోడ్డు నిర్మాణంతో పాటు కోడూరు, కన్నాయిపల్లి, చీటూరు రోడ్లను త్వరలోనే పూర్తి చేయిస్తానని తెలిపారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులను నిషేధించేందుకు గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. యువత గంజాయికి బలికాకుండా గ్రామస్థాయిలో సామాజిక బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందిరా, ఉపాధ్యక్షులు గుడి వంశీధర్‌రెడ్డి, కిసర దిలీప్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శివకుమార్‌, మండల అధ్యక్షుడు సాధం విజయ్‌ మనోహర్‌, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.