epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

420 హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

420 హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులా?
ప్రజా ఉద్యమాలను అరెస్టులతో అడ్డుకోలేరు
వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లోకి వెళ్తాం
హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు
మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

కాకతీయ, హన్మ‌కొండ‌ : ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తరఫున నిరసన చేపడుతుంటే పోలీసులతో అడ్డుకోవడం సరికాదన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చెప్పుకోదగిన స్థాయిలో అమలు జరగలేదని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని బాండ్‌ పేపర్లపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిందని విమర్శించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఛార్జ్‌షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామని వినయ్‌భాస్కర్‌ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణను అభివృద్ధిలో ముందంజలో నిలిపితే.. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసనలు, పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

 

అనుమతి ఉన్నా నిరసనకు అడ్డంకులు..

హామీల అమలును ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారని వినయ్‌భాస్కర్‌ తెలిపారు. ఆదాలత్‌ సర్కిల్‌ వద్ద తనను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని చెప్పారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సుబేదారి జంక్షన్‌లో నిరసనను కొనసాగించారని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నారు. అరెస్టులు, కేసులతో ప్రజా ఉద్యమాలను నిలువరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వినయ్‌భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కల్పించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో అరెస్టయిన వినయ్‌భాస్కర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. హామీల అమలును ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులు, అరెస్టులను ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.