భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ
పోచమ్మ దేవాలయ వీధి పరపతి సంఘం ఆధ్వర్యంలో పూజలు
కాకతీయ, హన్మకొండ : హన్మకొండ పోచమ్మకుంటలోని పోచమ్మ దేవాలయ వీధి పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళా సభ్యులు బైరి మంగ, అల్లి సౌజన్య, కల్లపెళ్లి రజిత, నేత నీరజ, సులోచన, మమత తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికతలతో వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

