ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం
కాకతీయ, పెద్దవంగర : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయమని సర్పంచ్ దంతలపల్లి పర్శరాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో ప్రగతి సేవ సమితి సారథ్యంలో శంకర కంటి హాస్పిటల్ నానక్ రామ్ గూడ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు.కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్, కోఆర్డినేటర్ జలగం రామ్మూర్తి, విజయ,సుమలత,త్రివేణి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

