epaper
Friday, September 25, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గురుకులాల్లో క‌నీస వ‌స‌తులు క‌రువు

గురుకులాల్లో క‌నీస వ‌స‌తులు క‌రువు
విద్యార్థినుల‌కు భ‌ద్ర‌త ఉండ‌టం లేదు
14 మంది బాలికలను ఎలుకలు కరిచినా పట్టని అధికారుల తీరు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాల‌కుర్తి బాలిక‌ల గురుకుల ఘ‌ట‌న‌పై మాజీమంత్రి ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం
విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్న పోలీసులు

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : గురుకుల పాఠశాలలో 14 మంది బాలికలను ఎలుకలు కరిచే వరకు అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. విద్యార్థినుల పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పేందుకు పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లిన తనను పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని విమర్శించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లగా పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి గేటు ఎదుట నిరసన చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థినుల పరిస్థితిని వివరించారు.

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదా?

విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటనపై వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదన్నారు. గతంలో ఇదే పాఠశాల వాచ్‌మెన్‌ను పాము కరిచిన ఘటన కూడా జరిగిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పక్కనే గురుకులం ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తాను ఏడాదికి రెండుసార్లు గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని కనీస వసతులు కల్పించేవాడినని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అధికారులు వెంటనే విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్యం అందించాలని, గురుకులంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ఎలుకల బెడదను పూర్తిగా నివారించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థినుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనకు బీఆర్‌ఎస్‌ మండల శ్రేణులు మద్దతు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం పూర్తి...

కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం వరంగల్‌ మార్కెట్‌ యార్డులో తొలి బస్తాకు రూ.8775...

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ? 

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ?  ప్రణాళిక లేని కట్టడాలతో మునకలో వరంగల్ రెండో రాజధాని...

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి అక్టోబర్‌ 1 నుంచి స్లాబ్‌ విస్తీర్ణంపై...

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు యోగ...

రూ.6 వేల కోసం.. కంప్యూటర్‌ రూమ్‌కు తాళం!

రూ.6 వేల కోసం.. కంప్యూటర్‌ రూమ్‌కు తాళం! కోట్ల ఆదాయం వచ్చే మార్కెట్‌లో...

కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా?

కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా? ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై కాంగ్రెస్‌...

గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి కాకతీయ, హనుమకొండ: హనుమకొండ రాంనగర్‌కు చెందిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.