కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం
వరంగల్ మార్కెట్ యార్డులో తొలి బస్తాకు రూ.8775 ధర
ఎం.వి.తండా రైతు జి.రమణకు సన్మానం
మార్కెట్ యార్డును పరిశీలించిన సీపీ ఎన్.శ్వేత
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ పత్తి యార్డులో కొత్త పత్తి ప్రైవేట్ కొనుగోళ్లకు గురువారం శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు నిర్వహించిన ముహూర్త కార్యక్రమంలో జెండా పాట నిర్వహించి తొలి పత్తి బస్తాకు రూ.8775 ధర నిర్ణయించారు. నల్లబెల్లి మండలం ఎం.వి.తండాకు చెందిన రైతు జి.రమణ తీసుకొచ్చిన పత్తికి ఈ ధర పలికింది. దీంతో రైతును చైర్మన్, పాలకవర్గ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. అనంతరం మధ్యాహ్నం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మార్కెట్ యార్డును సందర్శించారు. యార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటి పనితీరును పరిశీలించారు. మార్కెట్‌కు వస్తున్న మిర్చి రకాలు, వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. సీజన్‌లో తలెత్తే శాంతిభద్రతల సమస్యలపై అధికారులను ఆరా తీశారు. కార్యక్రమంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, వైస్‌చైర్మన్ బండి జనార్ధన్, కమిటీ సభ్యులు గజ్జల శ్యాం, దుగ్యాల గోపాల్‌రావు, కందుకూరి పూర్ణచందర్, ఛాంబర్ అధ్యక్షుడు బొమ్మనేని రవీందర్‌రెడ్డి, కార్యదర్శి మడురి వేదప్రకాష్, కాటన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు

