epaper
Friday, September 25, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.6 వేల కోసం.. కంప్యూటర్‌ రూమ్‌కు తాళం!

రూ.6 వేల కోసం.. కంప్యూటర్‌ రూమ్‌కు తాళం!
కోట్ల ఆదాయం వచ్చే మార్కెట్‌లో ఇదేం దుస్థితి?
నెల రోజులుగా మూతపడిన కంప్యూటర్‌ రూమ్‌
ఏడాదిగా రూ.60 లక్షల శానిటేషన్‌ బిల్లులు పెండింగ్‌
పాలకులు, అధికారుల తీరుపై రైతులు.. వ్యాపారుల ఆగ్రహం

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరున్న ఎనుమాముల మార్కెట్‌లో నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోజూ లక్షల రూపాయల లావాదేవీలు.. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మార్కెట్‌లో కేవలం రూ.6 వేల పాత బకాయి చెల్లించలేక కంప్యూటర్‌ రూమ్‌కు నెల రోజులుగా తాళం పడటం చర్చనీయాంశంగా మారింది. మార్కెట్‌ నిర్వహణలో కీలకమైన కంప్యూటర్‌ వ్యవస్థ పనిచేయకపోవడంతో కూరగాయల మార్కెట్‌ లావాదేవీల లెక్కలు, రసీదులు, ఇతర డేటా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరంగల్‌ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లోని కంప్యూటర్‌ రూమ్‌ నెల రోజులుగా తెరుచుకోవడం లేదు. గతంలో కంప్యూటర్‌ రిపేర్‌ చేసిన టెక్నీషియన్‌కు చెల్లించాల్సిన రూ.6 వేల బకాయి ఇప్పటికీ ఇవ్వలేదని సమాచారం. ఆ మొత్తం చెల్లిస్తేనే కంప్యూటర్‌ను తిరిగి బాగు చేస్తానని టెక్నీషియన్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మార్కెట్‌లో చిన్న మొత్తం కోసం కీలకమైన కంప్యూటర్‌ వ్యవస్థ నిలిచిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పండ్ల మార్కెట్‌ కంప్యూటర్‌పైనే ఆధారం

కూరగాయల మార్కెట్‌ కంప్యూటర్‌ రూమ్‌ మూతపడటంతో అక్కడి లావాదేవీలకు సంబంధించిన పనులను పక్కనే ఉన్న పండ్ల మార్కెట్‌లోని కంప్యూటర్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే కంప్యూటర్‌పై అదనపు భారం పడటంతో రోజువారీ లెక్కలు, రసీదుల జారీ, కిరాయిల వసూళ్ల నమోదు వంటి పనుల్లో జాప్యం ఏర్పడుతున్నట్లు సమాచారం. మార్కెట్‌లో జరిగే లావాదేవీలకు సంబంధించిన సమాచారం సకాలంలో అందుబాటులో లేకపోవడం పారదర్శకతపైనా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఏ వ్యాపారి ఎంత చెల్లించారు? ఏ రోజు ఎంత ఆదాయం వచ్చింది? అనే వివరాలను వెంటనే పరిశీలించే పరిస్థితి లేకపోవడం నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోంది. మార్కెట్‌లో అత్యవసర మరమ్మతులు, చిన్నచిన్న పనులు చేయించేందుకు గతంలో అధికారులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆ పనులకు సంబంధించిన బిల్లులు కూడా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో అత్యవసర పనులు వచ్చిన ప్రతిసారీ సొంతంగా డబ్బులు పెట్టాల్సి వస్తోందని అధికారులు వాపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తాలు తిరిగి రాకపోవడంతో కొత్త పనులకు డబ్బులు పెట్టేందుకు సిబ్బంది వెనుకంజ వేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఏడాదిగా రూ.60 లక్షల శానిటేషన్‌ బిల్లులు

మార్కెట్‌ నిర్వహణలో మరో కీలక సమస్య శానిటేషన్‌ బిల్లుల పెండింగ్‌. సుమారు ఏడాది కాలంగా రూ.60 లక్షల వరకు పారిశుద్ధ్య బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. మార్కెట్‌లో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు కూలీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వారికి కాంట్రాక్టర్లు రోజువారీగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అయితే బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్కెట్‌లో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్లు కొత్త పనులకు ముందుకు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో కొత్త టెండర్లలో పాల్గొనేందుకు కూడా కొందరు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఎనుమాముల మార్కెట్‌ ద్వారా రోజూ భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి. మార్కెట్‌ ఫీజులు, కిరాయిలు, ఇతర మార్గాల్లో గణనీయమైన ఆదాయం సమకూరుతున్నప్పటికీ రూ.6 వేల బకాయిని చెల్లించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మార్కెట్‌కు వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తోంది? నిర్వహణకు అవసరమైన చిన్నచిన్న చెల్లింపులు కూడా ఎందుకు నిలిచిపోతున్నాయి? ఏడాదిగా రూ.60 లక్షల శానిటేషన్‌ బిల్లులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? అనే ప్రశ్నలు రైతులు, వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మార్కెట్‌ నిర్వహణలో నిధుల లభ్యత, బిల్లుల చెల్లింపు, రోజువారీ ఆదాయ వ్యయాలపై ఉన్నతాధికారులు సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

పాలకవర్గం ఏం చేస్తోంది?

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరున్న ఎనుమాములలో మౌలిక నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఈ స్థాయికి చేరడం మార్కెట్‌ పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కంప్యూటర్‌ రూమ్‌ నెల రోజులుగా మూతపడినా సమస్య పరిష్కారం కాకపోవడం.. శానిటేషన్‌ బిల్లులు ఏడాది పాటు పెండింగ్‌లో ఉండటం.. అత్యవసర పనులకు అధికారులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి రావడం వంటి అంశాలు మార్కెట్‌ యంత్రాంగం పనితీరును ప్రశ్నించేలా చేస్తున్నాయి. మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే కంప్యూటర్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని, పెండింగ్‌ బిల్లులను పరిష్కరించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. మార్కెటింగ్‌ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మార్కెట్‌ ఆదాయం–వ్యయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించి, నిధుల కొరతకు అసలు కారణాలను వెలికితీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం పూర్తి...

కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం వరంగల్‌ మార్కెట్‌ యార్డులో తొలి బస్తాకు రూ.8775...

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ? 

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ?  ప్రణాళిక లేని కట్టడాలతో మునకలో వరంగల్ రెండో రాజధాని...

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి అక్టోబర్‌ 1 నుంచి స్లాబ్‌ విస్తీర్ణంపై...

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు యోగ...

కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా?

కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా? ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై కాంగ్రెస్‌...

గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి కాకతీయ, హనుమకొండ: హనుమకొండ రాంనగర్‌కు చెందిన...

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం అర్హులైన దళితులకు భూమి పంపిణీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.