గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలి
కాకతీయ, హనుమకొండ: హనుమకొండ రాంనగర్‌కు చెందిన గూడూరు జయశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల నేతలు చుంచు రాజేందర్, మాదాసి సురేష్, కేడల ప్రసాద్, అంకేశ్వరపు రామచందర్‌రావు డిమాండ్ చేశారు. ఇంట్లో నిరసన చేపట్టి నాలుగో రోజుకు చేరిన జయశ్రీకి వారు మద్దతు తెలిపారు. గతంలో అత్త మీరాబాయి నోటరీ ద్వారా రాసిచ్చిన ఇల్లు, ఆస్తులు ఇప్పించాలని, ఆమెను బంధించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే, సీపీ, కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ మంద వీరాస్వామి, మేడ స్వామి మాదిగ, మోరే ఐలయ్య, గోల్కొండ శ్రీనివాస్, శ్రీరాం మల్లేశం పాల్గొన్నారు.

