ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
కాకతీయ, శంకరపట్నం : తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో అనిత, ఎస్సై కట్కూరి శేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ జీవితాన్ని, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హుజురాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపెల్లి తిరుపతి, సింగిల్ విండో చైర్మన్లు గోపగోని బసవయ్య, గాజుల మహేష్, మాజీ జెడ్పీటీసీలు బత్తిని శ్రీనివాస్ గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పొద్దుటూరు సంజీవరెడ్డి, మండల నాయకులు బండారి తిరుపతి, గంట మహిపాల్, ఎనుగుల అనిల్, పిట్టల సమ్మయ్య, సర్పంచులు గోదారి రాజేంద్రప్రసాద్, వెన్నెం మల్లేశం, కొయ్యడ కుమార్, నెలవేని మహేష్, విద్యాసాగర్‌రావు, రజక సంఘం నాయకులు కల్లెపెల్లి క్రాంతికుమార్, రాసమల్ల శ్రీనివాస్, కల్లెపెల్లి కిరణ్, దండు కొమురయ్య, కల్లెపెల్లి రాజయ్య, దండు సమ్మయ్య, పావురాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

