కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
పూర్వ వలంటీర్లు, అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
50 ఏళ్ల సేవలను గుర్తుచేసుకున్న పూర్వ వాలంటీర్లు
ఎన్ఐసీ పూర్వ వాలంటీర్ పత్తేం శ్రీనివాస్‌కు సన్మానం
కాకతీయ, చిగురుమామిడి: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన 2005 ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఎన్ఐసీ పూర్వ వాలంటీర్ పత్తేం శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు. మాజీ వాలంటీర్లు, యూత్ అవార్డు గ్రహీతలు, నేషనల్ అవార్డీలు, ఎన్ఎస్ఎస్ ఎన్ఐసీ క్యాంపుల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపైకి చేరారు. ఎన్ఎస్ఎస్ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని విద్యార్థులు వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, కేయూ వైస్‌చాన్స్‌లర్ కె. ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్ వి. రామచంద్ర, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రొఫెసర్లు కిష్టయ్య, తాళ్లపల్లి మనోహర్, సురేష్‌లాల్, రమణ, ఆర్. ప్రవీణ్‌కుమార్, సత్యనారాయణ యాదగిరి, ఎస్ఆర్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మురళీ, జ్యోతి, ఎన్ఎస్ఎస్ అవార్డీలు కొండ రవి, కళింగ శేఖర్, ఏ. కిరణ్, అలువాల విష్ణు, రవిప్రసాద్, మధు, పత్తేం శ్రీనివాస్, మాజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జీవన్, రాజమౌళి, వడ్లకొండ అనిల్, బుర్ర సతీష్, నాగరాజు, ప్రవీణ్, అశోక్, శ్రీనివాస్, ఓరుగంటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

