ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి ఉపసర్పంచ్
అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి యాదగిరి
సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తల చేరిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు
కాకతీయ, ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో సత్తూరి యాదగిరితో పాటు సుమారు 500 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మండల అభివృద్ధి కోసం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చేస్తున్న పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి తెలిపారు. క్యాడర్‌తో కలిసి బీఆర్ఎస్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కే.టీ.రామారావు గులాబీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బానోత్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

