epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌
నవంబర్‌ రెండో వారంలో పనులకు శ్రీకారం
2027 వానాకాలం నాటికి మరమ్మతులు పూర్తి చేసేలా కసరత్తు
అక్టోబర్‌ 5న సాంకేతిక నివేదికలు సమర్పణ
ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాల మేరకే పునరుద్ధరణ
నాణ్యత, భద్రత విషయంలో రాజీ ఉండదు
నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిపుణుల సూచనలు, జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని నిర్ణయించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను నవంబర్‌ రెండో వారం నుంచి ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమీక్షలో వెల్లడించారు. దెబ్బతిన్న నిర్మాణాలపై నిర్వహిస్తున్న సాంకేతిక పరీక్షలు, అధ్యయనాల ఆధారంగా మరమ్మతుల విధానాన్ని ఖరారు చేయనున్నారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా సమగ్రంగా పరిశీలించి పనులు చేపట్టనున్నారు.
అక్టోబర్‌ 5న సాంకేతిక నివేదిక
కేంద్ర జల సంఘం సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి అక్టోబర్‌ 5న పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లు, సాంకేతిక వివరాలు సమర్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర సంస్థల సూచనలు, అవసరమైన అనుమతులు వచ్చిన అనంతరం పనులను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే మేడిగడ్డలో భౌగోళిక, భూసాంకేతిక పరీక్షలు, నమూనాల సేకరణ కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2027 వానాకాలం ప్రారంభానికి ముందే మూడు బ్యారేజీల మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పనుల్లో నాణ్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనలకు అనుగుణంగానే పునరుద్ధరణ చేపట్టాలని స్పష్టం చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బ్యారేజీలను పటిష్ఠంగా పునరుద్ధరించడంతోపాటు భవిష్యత్‌లో భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో సాంకేతిక నిపుణులు, కేంద్ర సంస్థలు, నీటిపారుదల శాఖ సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను...

ఉప‌పోరు..ఉత్కంఠ‌

ఉప‌పోరు..ఉత్కంఠ‌ ఖైరతాబాద్‌లో మూడు పార్టీల మోహరింపు! దానం నాగేందర్‌ చుట్టూనే కాంగ్రెస్‌ కసరత్తు సాయికిరణ్‌ యాదవ్‌...

గోదావరి వరదను వృథా చేయొద్దు

గోదావరి వరదను వృథా చేయొద్దు అన్ని మోటార్లు నడిపి రిజర్వాయర్లు నింపాలి కాళేశ్వరం జలాలను...

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి

వ‌రంగ‌ల్ అభివృద్ధికి నిధులివ్వండి కాకతీయ వర్సిటీకి పీఎం–ఉషా నిధులు తేవాలి పురావస్తు మ్యూజియానికి రూ.10...

దానంకు సుప్రీంలో షాక్‌

దానంకు సుప్రీంలో షాక్‌ ఎమ్మెల్యేపై అనర్హత వేటు ఖరారు హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీం...

దళితులు, గిరిజనులకు భరోసా

దళితులు, గిరిజనులకు భరోసా ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల్లో పెద్దపీట ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర...

నయీం ఆస్తుల లెక్క తారుమారు..!

నయీం ఆస్తుల లెక్క తారుమారు..! 327 ఆస్తులపై జీవో.. గెజిట్‌ జారీ తూప్రాన్‌పేటలోనే ఎందుకీ...

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా!

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా! ప‌ట్ట‌ణ శివారులోనే భారీ స్టాకు పాయింట్‌ పీడీఎస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.