epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ్రిటన్‌లో జాత్యహంకారం.. 20 ఏళ్ల సిక్కు యువతిపై అత్యాచారం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: బ్రిటన్‌లో భారత సంతతి ప్రజలపై జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతి అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి రావడంతో అక్కడి భారతీయ సమాజం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇద్దరు శ్వేతజాతీయ దుండగులు యువతిపై దాడి చేసి, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ మీ దేశానికి తిరిగి వెళ్లిపో అని అరిచినట్లు తెలుస్తోంది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ సంఘటన గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్ రోడ్ సమీపంలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు దీనిని సాధారణ నేరంగా కాకుండా జాత్యహంకార ప్రేరేపిత దాడిగా నమోదు చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒకరు ముదురు రంగు స్వెట్‌షర్ట్, మరొకరు గ్రే కలర్ టాప్ ధరించి ఉన్నారని గుర్తించారు.

ఈ ఘటనపై స్థానిక సిక్కు సమాజం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించి, పెట్రోలింగ్‌ను పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. “సమాజంలో భయం పుట్టకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాము” అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీలు కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. బర్మింగ్‌హామ్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. ఇది కేవలం హింస కాదు, మానవత్వంపై మచ్చ. బాధితురాలు ఈ దేశానికి చెందనట్టు దుండగులు అన్నా, ఆమె కూడా ఈ నేలదే. ప్రతి ఒక్కరికీ గౌరవంగా, సురక్షితంగా జీవించే హక్కు ఉంది. బ్రిటన్‌లో జాత్యహంకారానికి స్థానం లేదు” అని పేర్కొన్నారు.

మరో ఎంపీ జస్ అత్వాల్ ఈ ఘటనను హేయమైన, స్త్రీ ద్వేషపూరిత దాడి”గా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న జాత్యహంకార ఉద్రిక్తతల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఈ అమానుష దాడి బాధితురాలికి జీవితాంతం మానసిక క్షోభ మిగులుస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నెల రోజుల క్రితం వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు టీనేజర్లు దాడి చేసిన ఘటన మరవకముందే, మరోసారి సిక్కు సమాజం లక్ష్యంగా మారడం స్థానికులలో ఆందోళన రేపుతోంది. ఈ సంఘటనలపై యూకే ప్రభుత్వానికి కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ సమాజం డిమాండ్ చేస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం! * ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.....

ప్రజల భద్రతకు భరోసా..

ప్రజల భద్రతకు భరోసా.. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయం: పోలీస్ కమిషనర్ కాకతీయ,...

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి!

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి! అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి పట్టభద్రుల...

కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 72 వాహనాలు సీజ్.. ప్రజలు...

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి * కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు...

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి! చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ గ్రామానికి తొలిసారి...

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి..

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.. నీటి వనరులను సంరక్షిస్తూ...

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ!

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ! ఐదు కార్లు, అంబులెన్స్‌ పరస్పరం ఢీకొన్న వైనం పార్టీ కార్యకర్తలు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.