గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
కడవేరుగు సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్త
వాటర్ ప్లాంట్,స్థలదాతలకు గ్రామస్తుల కృతజ్ఞతలు
కాకతీయ, చేర్యాల : గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కడవేరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎన్ఆర్ విఐ వాసవి అసోసియేషన్ అమెరికా వారు ఈ ప్లాంట్ను అందించగా, వారి ప్రతినిధి గంప పద్మ రామ్మోహన్, సిద్ధిపేట వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని అందించిన సువాసిని రంగారెడ్డిని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్త, ఉప సర్పంచ్ సురేందర్, పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి రాజు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి చేయూతనిస్తూ, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చిన దాతలకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రగతికి బాటలు వేస్తాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత దోహదపడతాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

