epaper
Saturday, October 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు

కాళేశ్వరం వైఫల్యాలతోనే నేటి కష్టాలు
కల్వకుంట్ల కుటుంబానికే నీళ్లు, నిధులు, నియామకాలు
తెలంగాణ నినాదాన్ని స్వార్థం కోసం వాడుకున్న కేసీఆర్‌
ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూరి వెంకట్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ బల్మూరి వెంకట్‌ విమర్శించారు. తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు పోరాడితే, ఆ ఫలాలను మాత్రం కేసీఆర్‌ కుటుంబం అనుభవించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత కష్టాలకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని, కేసీఆర్‌ ఆ నినాదాన్ని తన కుటుంబ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని బల్మూరి వెంకట్‌ ఆరోపించారు. కాసుల కోసం కక్కుర్తిపడి నిర్మించాల్సిన చోట ప్రాజెక్టులు నిర్మించలేదని, కాళేశ్వరం నీళ్లు తన ఫామ్‌హౌస్‌కు చేరేలా ప్రణాళికలు రూపొందించుకున్నారని విమర్శించారు. నియామకాల విషయంలోనూ కుటుంబ సభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్‌, కవిత, సంతోష్‌రావు, ఇతర బంధువులకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. నిధుల విషయంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, బీఆర్‌ఎస్‌ ఖాతా విరాళాలతో నిండిందని బల్మూరి వెంకట్‌ విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిధులను దారి మళ్లించారని, భూములు, వ్యాపారాలను పెంచుకున్నారే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కరువుకు ప్రజా ప్రభుత్వమే కారణమన్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం అవివేకమని అన్నారు. హరీశ్‌రావు చేస్తున్న ధర్నా రైతుల కోసం కాదని, వారి మామ ఫామ్‌హౌస్‌కు నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనేనని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలు గమనించే బీఆర్‌ఎస్‌ను అధికారానికి దూరం చేశారని పేర్కొన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే ప్రస్తుత కష్టకాలంలో అది ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు. గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలుసని ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూరి వెంకట్‌ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం...

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి!

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు..! గురువారం తెలంగాణ భవన్‌లో వ‌రంగ‌ల్...

విదేశీ మద్యం ధరలు పెంపు

విదేశీ మద్యం ధరలు పెంపు ఫుల్‌ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు...

మెడిక‌వ‌ర్ మాట మార్చింది

మెడిక‌వ‌ర్ మాట మార్చింది మిస్ట‌రీగా న్యాయ‌వాది ఐశ్వ‌ర్య మృతి 2 ఎంఎం స్టోన్‌ అన్నారు.....

పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం

పట్టభద్రుల బరిలో బీజేపీ బీసీ అస్త్రం సుందర్‌రాజ్‌ వైపు అధిష్ఠానం చూపు! నల్లగొండ గ్రాడ్యుయేట్‌...

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు

ఓపెన్ కాస్టుతో రామప్పకు ముప్పు త‌ప్ప‌దు సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే ప్రమాదం ఇప్ప‌టికే...

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు

రీజినల్‌ ఐ హాస్పిటల్‌ను తరలిస్తే సహించేది లేదు ఉత్తర తెలంగాణ పేదలకు ఆసుపత్రి...

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు 13నుంచి సమ్మెకు దిగుతున్న ఉద్యోగులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.