పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటాలి
ఓటరు నమోదు వేగవంతం చేయాలి
శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్,ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, దుగ్గొండి : వరంగల్, ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని కనిష్క ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, ఓటరు నమోదు గ్రామాల ఇంచార్జిలతో మాట్లాడుతూ మండలలో అర్హులైన పట్టభద్రులను కలిసి ఓటు నమోదు చేయించాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగ యువత అగ్రహాంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయెట్స్ ఓట్లు నమోదు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,ఓటరు నమోదు ఇంచార్జిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

