epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్ర‌కృతి..ఆకృతి.. ఇంచ‌ర్ల‌లో సిద్ధ‌మ‌వుతున్న ఎకో పార్కు..!!

*ఇంచ‌ర్ల‌లో సిద్ధ‌మ‌వుతున్న ఎకో పార్కు
*ములుగు జిల్లా పర్యాటకానికి కొత్త ఊతం
*163 ఎకరాల్లో అభివృద్ధి.. పచ్చని చెట్లు, జలాశయాల హరివిల్లు
*ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే జోన్, వాకింగ్ పాత్‌లు, మేడిటేషన్ జోన్‌లు
*జీవవైవిధ్యంపై అవగాహన కలిగించేలా ప్రత్యేక ప్రదర్శనలకు ఏర్పాట్లు
*2 కోట్లతో కొన‌సాగుతున్న ప‌నులు..

దిశ, ములుగు : తెలంగాణ పర్యాటక రంగంలో మరో అద్భుతమైన ఆహ్లాదక ప్రదేశంగా ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్ పర్యాటకులకు కొత్త ఆహ్వానంగా మారుతోంది. ఇప్పటికే రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, బోగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యాలతో పర్యాటక జిల్లాగా నిలిచిన ములుగు, ఇప్పుడు ఇంచర్ల గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్ తో మరింత పర్యాటక ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ఎకో పార్క్‌ ప్రత్యేకతలు….

ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో 163 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎకో పార్క్ ప్రత్యేక ఆకర్షణలతో పర్యాటకులను రప్పించనుంది. ప్రకృతి ఒడిలో సేదతీరేలా రూపొందించిన ఈ పార్క్‌లో పర్యాటకుల కోసం పలు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. అరుదైన ఔషధ గుణాలు గల మొక్కలు, పండ్ల చెట్లు, పూల చెట్లు, చెట్ల కింద విశ్రాంతి కోసం పగోడాలు, సహజ సిద్ధన్న పారే జలవనరులను మెరుగుపరిచే చెక్ డ్యామ్‌లు, చెక్‌వాల్స్, వాకింగ్ ట్రాక్స్, నీటి పక్కన పంచవటిలాంటి విహార మార్గాలు ఇలా ప్రకృతి రమణీయతను ఉట్టిపడేలా ఎకో పార్క్ నిర్మాణం జరుగుతుంది.

ఆధునికత, సహజత్వానికి మేళవింపు..!

ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పరిధిలో రెండు కోట్లతో నిర్మిస్తున్న ఎకో పార్క్ పర్యాటకులను మాత్రమే కాకుండా పిల్లలకు, యూత్‌కు, ప్రకృతి ప్రేమికులకు విశేషంగా ఆకర్షణగా నిలవనుంది. ప్రత్యేక ఆకర్షణగా ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే జోన్, వాకింగ్ పాత్‌లు, మేడిటేషన్ జోన్‌లు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో అడవుల విలువ, చెట్ల ప్రాముఖ్యత, జీవవైవిధ్యంపై అవగాహన కలిగించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఉండనున్నాయి.

ములుగు జిల్లాకు మ‌రో మైలురాయి..

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో ఈ ఎకోపార్క్ నిర్మాణం మరో మైలురాయిగా నిలవనుంది. అడవులు, జలపాతాలు ఇప్పటికే ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటే ప్రకృతి అందాలు ఉట్టిపడేలా నిర్మించిన ఎకో పార్క్ ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా మారుతోంది. పచ్చదనం, ప్రశాంతత కోరే ప్రతి ఒక్కరి ప్రయాణం ములుగు జిల్లా వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో సైతం మరింత నిధులతో ఎకో పార్క్ అందాలను రెట్టింపు చేసే అవకాశాలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈనెల 15న దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఎకోపార్క్ ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్ర‌కృతిని ప‌రిచ‌యం చేయ‌డ‌మే ల‌క్ష్యం : డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్

ఎకో పార్క్ నిర్మాణానికి సుమారు రూ.2 కోట్లు కేటాయించి ప్రకృతిని అందరికీ పరిచయం చేసేందుకు, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి చేసి ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకర వాతావరణ ఇచ్చేలా ఈ ఎకోపార్క్ రూపుదిద్దుకుంటోంది. ప్రతి పర్యాటకుడు ప్రకృతి గొప్పతనాన్ని అనుభవించేలా తీర్చిదిద్దుతున్నాం.ఎకోపార్క్ లో నిర్మించబోయే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ జీవవైవిద్యాన్ని , ప్రకృతి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా రూపొందిస్తున్నాం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.