epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భార‌త్‌కు చుక్క‌లు చూపించిన సౌతాఫ్రికా కొత్త హీరో.. ఎవ‌రీ ముత్తుసామి?

భార‌త్‌కు చుక్క‌లు చూపించిన సౌతాఫ్రికా కొత్త హీరో.. ఎవ‌రీ ముత్తుసామి?
గౌహతి టెస్ట్‌లో మెరిసిన సౌతాఫ్రికా సూపర్ హీరో ముత్తుసామి
తమిళనాడు మూలాలున్న దక్షిణాఫ్రికన్
తండ్రి కల… కానీ 11 ఏటనే ఎదురైన పెద్ద దెబ్బ

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ సెనురాన్ ముత్తుసామి పేలవంగా ప్రారంభమైన ఇన్నింగ్స్‌ను అద్భుతమైన సెంచరీతో కొత్త మలుపు తిప్పాడు. 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109 రన్స్ కొట్టి టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను, టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నిర్మించి సౌతాఫ్రికాను 489 పరుగుల భారీ స్కోర్‌దిశగా నడిపించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో భార‌త్ కు చుక్క‌లు చూపించిన ఈ సౌతాఫ్రికా కొత్త హీరో గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ప్ర‌స్తుతం ఎంతో ఉత్సాహం చూపుతున్నారు.

సెనురాన్ ముత్తుసామి కుటుంబం అసలు తమిళనాడులోని నాగపట్నం ప్రాంతానికి చెందినది. అతడు పుట్టకముందే కుటుంబం దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది.1994 ఫిబ్రవరి 22న డర్బన్‌లో జన్మించిన ముత్తుసామి, నటల్ ప్రావిన్స్‌లో పెరిగాడు. క్లిఫ్టన్ కాలేజీలో చదువు ప్రారంభించి, క్వాజులు-నాటల్ యూనివర్సిటీలో సోషల్ సైన్స్‌లో బ్యాచిలర్ కంప్లీట్ చేశాడు. తర్వాత మీడియా, మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ చేశాడు.

అతన్ని క్రికెట్‌లోకి తీసుకొచ్చింది అతని తండ్రే. కానీ ముత్తుసామి వయసు 11 ఏళ్లు ఉన్నప్పుడు తండ్రి మృతి చెందడంతో అత‌ని కుటుంబం పెద్ద షాక్‌కి గురైంది. తండ్రి కోరిక నెరవేర్చాలని నిర్ణయించుకున్న ముత్తుసామి రోజుకు 5–6 గంటలు ప్రాక్టీస్ చేస్తూ ఆటలో మెరుగు పడ్డాడు. అండర్-11 నుంచి అండర్-19 వరకు క్వాజులు నాటల్ జట్టు తరఫున ఆడిన ముత్తుసామి, ఆరంభంలో క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవడంలో సందేహపడ్డాడు. అయితే అద్భుత ప్రదర్శనలతో సౌతాఫ్రికా అండర్-19 జట్టులోకి అడుగుపెట్టాడు.

2011-16లో డాల్ఫిన్స్ తరఫున టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడాడు. 2017లో నైట్స్‌పై 181 పరుగుల ఇన్నింగ్స్‌తో హిట్ అయిన‌ప్ప‌టికీ.. ఆ ఫామ్ ఎక్కువకాలం నిలవలేదు. బ్యాటింగ్ తగ్గినా బౌలింగ్‌లో మెరుస్తూ ఆల్‌రౌండర్‌గా మారాడు. 2019లో భారత్ పర్యటనతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి మ్యాచ్‌లో కోహ్లీని రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చి ఫోక‌స్ అయ్యాడు. కానీ కేశవ్ మహరాజ్ అద్భుత ప్రదర్శన కారణంగా జట్టులో స్థిరంగా అవకాశాలు రాలేదు. అయినా కష్టపడి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎదిగాడు. ఇక గౌహతి టెస్ట్‌లో సెంచ‌రీ చేసి భార‌త్ గెలుపు ఆశ‌ల‌ను చిదిమేసిన ముత్తుసామి, ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో కేవలం మ్యాచ్‌ను మార్చడమే కాదు.. తన కెరీర్‌ను కూడా రీబ్రాండ్ చేసుకున్నాడు. అతని డిఫెన్స్, షాట్ సెలెక్షన్, టెయిలెండర్లతో చేసే భాగస్వామ్యాలు దక్షిణాఫ్రికాకు ఊహించని ఎడ్జ్‌ను ఇచ్చాయి అన‌డంలో సందేహం లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.