epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పానీపూరి తిన్న‌ 15 మంది చిన్నారులకు అస్వస్థత!

పానీపూరి తిన్న‌ 15 మంది చిన్నారులకు అస్వస్థత!
తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో ఘటన
తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు
బాలుడికి తీవ్ర జ్వరంతో పాటు.. ఫిట్స్
బాధితులంద‌రికీ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్య‌వ‌స‌ర చికిత్స‌

కాక‌తీయ‌, రాజన్న సిరిసిల్ల : రాజ‌న్న సిరిసిల్ల‌ జిల్లా తంగళపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని 15 మందికి పైగా చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి పానీపూరి తిన్న కొద్దిసేపటికే చిన్నారులంతా ఒక్కొక్కరుగా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో పడిపోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

బాలుడికి ఫిట్స్.. తల్లిదండ్రుల ఆందోళన
బాధితుల్లో రిషికేష్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో పాటు ఫిట్స్ కూడా రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడికి వైద్యులు ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యాధికారులు వెల్లడించారు. చిన్నారుల అనారోగ్యానికి అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉండగా, పూర్తి స్థాయి వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజనింగ్ కోణంలో దర్యాప్తు
అయితే చిన్నారుల అస్వస్థతకు పానీపూరి తినడమే కారణమా? లేక కలుషిత నీరు లాంటి మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా ఇది ఫుడ్ పాయిజనింగ్ ఘటన అయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన వైద్య సిబ్బంది కేసీఆర్ నగర్ కాలనీలో పర్యటించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తమ పిల్లలు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కాలనీలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.