బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల చేయూత
కాకతీయ, హనుమకొండ: వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిర్ర రామన్న గౌడ్ రెండు బాధిత కుటుంబాలకు ఆర్థిక, నిత్యావసర సాయం అందజేశారు. పెగడపల్లి గ్రామానికి చెందిన పోలేపాక కుమార్ కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే ముచ్చర్ల గ్రామానికి చెందిన సిర్లంచ విజయ దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు రూ.11 వేల ఆర్థిక సాయం చేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రామన్న గౌడ్ అన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీటీసీ సంపత్ యాదవ్, బండ దేవేందర్ రెడ్డి, గుడికందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

