ఓటు బచావో.. దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయాలి!
నవంబర్ 1న ఢిల్లీలో జాతీయ ర్యాలీ
ఉమ్మడి వరంగల్ నుంచి భారీగా తరలిరావాలి
ఆర్జీపీఆర్ఎస్ వరంగల్ జోన్ ఇన్చార్జి రడం భరత్‌కుమార్ పిలుపు
కాకతీయ, వరంగల్ : ప్రజాస్వామ్య పరిరక్షణ, పౌరుల ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా నవంబర్ 1న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ జాతీయ ర్యాలీని విజయవంతం చేయాలని ఆర్జీపీఆర్ఎస్ వరంగల్ జోన్ ఇన్చార్జి రడం భరత్‌కుమార్ పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇండియా కూటమి పక్షాలతో కలిసి రామ్‌లీలా మైదానంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో భారీగా తరలిరావాలని కోరారు. ఆర్జీపీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జులు బానోతు రాఘవేంద్ర, గునిగంటి శ్రీదేవి మాట్లాడుతూ మహిళా, యువజన నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

