epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏం తమాషా చేస్తున్నారా?.

ఏం తమాషా చేస్తున్నారా?.
మైసమ్మ ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం.
అధికారులకు 48 గంటల గడువు.

కాకతీయ, గోదావరిఖని : గోదావరిఖని,ఎన్‌టీపీసీ రోడ్డుపై ఉన్న 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ, అదే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను వదిలేయడం వెనుక ఏ ఉద్దేశ్యమో అధికారులే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులోని తన నివాసం నుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి అవి ఎందుకు కూల్చలేదు? హిందూ ఆలయాలంటే అంత చులకనా? అని ఆయన ప్రశ్నించారు. అధికారుల సమాధానాలు తృప్తికరంగా లేకపోవడంతో, ఏం తమాషా చేస్తున్నారా? ఎవరి మెప్పు కోసం ఇంత దుర్మార్గంగా ఆలయాలను కూల్చారు? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.మీకు 48 గంటల గడువు ఇస్తున్నా. కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను ఆ సమయానికి పునర్నిర్మించండి.

లేకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందే. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేనే గోదావరిఖని వస్తా. అక్కడి పరిస్థితులు నేను స్వయంగా చూస్తా. ఆలయాలను పునర్నిర్మించకపోతే మసీదులన్నింటినీ కూల్చివేయిస్తా అని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా సంబంధిత అధికారులందరినీ ప్రజల ముందుకు తీసుకువస్తానని, భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలకు వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి జిల్లా నేతలతో తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నారు.స్థానికంగా ఆలయాల కూల్చివేతపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ప్రతిరోజూ భక్తులు మొక్కుకునే దారి మైసమ్మ ఆలయాలను అర్ధరాత్రి వేళ కూల్చివేయడంతో ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పునర్నిర్మాణం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని భక్తులు స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.