రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి
ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలి
హుజురాబాద్, మధిర తరహాలో సిరిసిల్లలోనూ అమలు చేయాలి
కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చిన దళితబంధు సాధన కమిటీ నేతలు
కాకతీయ, సిరిసిల్ల : రెండో విడత దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులందరికీ వెంటనే ఆర్థిక సాయం అందించాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. హుజురాబాద్, మధిర ప్రాంతాల్లో రెండో విడత పథకం అమలు చేసిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. రెండో విడతలో ఎంపికైనప్పటికీ ఇప్పటివరకు ఆర్థిక సాయం అందని వారికి నిధులు మంజూరు చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న లబ్ధిదారులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నీరటి కిరణ్కుమార్, వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ దమ్మ భాస్కర్, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గ మాల మహానాడు కన్వీనర్ బత్తుల కమలాకర్, చంటి బాబురావు, బండి శ్రావణ్, పెంట బాబు, గుడిసె రమేష్, కట్కూరి స్వామి, ఎల్. హరీష్, బత్తుల రవి, బింగి స్వామి, మల్యాల మహేష్, జి. దేవయ్య, న్యాత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

