epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు

అంజనా టౌన్‌షిప్‌పై తప్పుడు కథనాలు
నిరాధార వార్తలపై చట్టపరమైన చర్యలు తప్పవు
రాజకీయ కక్షతోనే ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు
విచారణకు రాకుండా ఫిర్యాదుల పరంపర
ఒక్క గుంట తేలినా మున్సిపాలిటీకి అప్పగిస్తాం
జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు

కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్‌షిప్‌పై ఆధారాలు లేని ఆరోపణలతో నిరాధార వార్తలు రాస్తూ, ప్రసారం చేస్తున్న పత్రికలు, ఛానెళ్లపై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేసినట్లు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు వ్యక్తులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అంజనా టౌన్‌షిప్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశామంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సహకారంతో లోకాయుక్తకు పలుమార్లు ఫిర్యాదులు చేస్తూ, విచారణకు మాత్రం హాజరుకాకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు.

అన్ని అనుమతులతో లేఔట్

అంజనా టౌన్‌షిప్ జమ్మికుంట పట్టణానికి తలమానికంగా నిలిచిందని, అన్ని ప్రభుత్వ అనుమతులతోనే లేఔట్ చేయబడిన టౌన్‌షిప్ అని స్పష్టం చేశారు. రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందంటూ అధికారులు వద్దకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అధికారుల విచారణలో అలాంటి కబ్జా జరగలేదని తేలిందన్నారు. విచారణలో క్లియర్ అయినా అదే అంశాన్ని పదే పదే పునరావృతం చేస్తూ, టౌన్‌షిప్‌లో నివసిస్తున్న సామాన్య కుటుంబాలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ప్రచారాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విచారణలో ఒకవేళ ఒక్క గుంట ప్రభుత్వ భూమి కబ్జా అయినట్టు తేలినా, ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వ భూమి కబ్జా జరిగిందంటూ తప్పుడు కథనాలు ప్రచురించడం సరికాదని అన్నారు. నిరాధార వార్తలు ప్రచురించిన పత్రికలు, ఛానెళ్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంజనా టౌన్‌షిప్‌కు సంబంధించిన అన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు, తప్పుడు కథనాల పత్రిక కటింగ్స్‌ను మీడియాకు చూపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.