epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూతల స్వర్గధామంగా ములుగు

భూతల స్వర్గధామంగా ములుగు
ప్రకృతి అందాల పరవశం.. భక్తి–చరిత్రల సంగమం
ఎకో టూరిజానికి కొత్త ఊపిరి
పర్యాటకుల కేరాఫ్‌గా జిల్లాకు గుర్తింపు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, చారిత్రక వైభవం కలగలిసిన ములుగు జిల్లా పర్యాటకులను ఆకట్టుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. భక్తి, ఆనందం, ప్రకృతి అందాలు అన్నీ ఒకేచోట అనుభవించగల ప్రాంతంగా ములుగు భూతల స్వర్గధామంగా మారిందని ఆమె అభివర్ణించారు.
బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఏటూరు నాగారం వైల్డ్‌లైఫ్ పరిధిలోని తాడ్వాయి వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ రేంజ్, తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుమారు 7 కిలోమీటర్ల మేర అరణ్య ప్రాంతంలో సఫారీ నిర్వహించారు. హాట్స్ పరిసరాల్లోని అరుదైన వృక్షజాలం, వాటి ప్రాధాన్యతను అటవీ అధికారులు వివరించారు.

భక్తి కేంద్రాలే పర్యాటకానికి బలము

ములుగు జిల్లాకు వచ్చే భక్తులు ముందుగా ఆది దేవత ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉందని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోందని, రామప్ప సరస్సు మధ్య ద్వీపకల్ప అభివృద్ధి త్వరలో పూర్తవుతుందని తెలిపారు. లక్నవరం సరస్సు, అక్కడి కాటేజీలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధికి రూ.251 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌కు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాను సెలవు దినాల్లో తప్పకుండా సందర్శించి ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని ఆస్వాదించాలని మంత్రి సీతక్క పర్యాటకులను ఆహ్వానించారు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి ములుగు ప్రత్యేకత అని ఆమె అన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.