epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మహిళల భద్రతకు చట్టమే కవచం

మహిళల భద్రతకు చట్టమే కవచం
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
పోష్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలి
ప్రతి కార్యాలయంలో అంతర్గత కమిటీ తప్పనిసరి
కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు పోష్ యాక్ట్–రెండు వేల పదమూడు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోష్ యాక్ట్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోష్ యాక్ట్‌కు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యస్థలాల్లో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం ప్రతి శాఖాధిపతి, కార్యాలయ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రతి కార్యాలయంలో కమిటీ ఏర్పాటు

పోష్ యాక్ట్ ప్రకారం పది మందికి మించిన సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ కమిటీలో యాభై శాతం మహిళలు ఉండాలని, మహిళా అధ్యక్షురాలు ఉండటంతో పాటు బయటి నిపుణుడిని సభ్యుడిగా నియమించాల్సిందేనని తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు గోప్యత పాటిస్తూ, నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బాధిత మహిళలకు భరోసా కలిగించే వాతావరణం ఉండాలని స్పష్టం చేశారు.

అవగాహనతోనే రక్షణ

పోష్ యాక్ట్‌పై ఉద్యోగులకు తరచూ శిక్షణలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. అన్ని కార్యాలయాల్లో గోడపత్రాలు, కరపత్రాలు ఏర్పాటు చేసి చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలు భయపడకుండా, ధైర్యంగా ఫిర్యాదు చేసే వాతావరణం కల్పించడమే ఈ చట్ట ప్రధాన లక్ష్యమని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జడ్పీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి రాంరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, ఆర్డీఓలు సుమారు, ఉమారాణి, జిల్లా మహిళా సాధికారత కేంద్రం అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.