epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆరు గ్యారెంటీల మాటేమైంది?

ఆరు గ్యారెంటీల మాటేమైంది?
కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు
మధిరలో మూడు స్థానాల్లో సీపీఎం పోటీ
సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు

కాకతీయ, బోనకల్ : మోసపూరిత హామీలతో, మాయమాటలతో ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు తీవ్రంగా విమర్శించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
బోనకల్ మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో మంగళవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోపాలరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలు అవలంబిస్తూ పెట్టుబడిదారులకు మేలు చేసి, పేద ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందన్నారు.
ఈ నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు.
మధిర మున్సిపాలిటీలో సీపీఎం, బీఆర్‌ఎస్ పొత్తుతో మూడు స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థానాల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తేనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి కిలారు సురేష్, నాయకులు పెద్దపోలు రామారావు, గుడ్డూరి వెంకటనరసయ్య, ఉప్పర శ్రీను, పసుపులేటి నరేష్, బంధం శ్రీనివాసరావు, నల్లమోతు వాణి, తెల్లాకుల శ్రీనివాసరావు, తాత వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.