epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సర్పంచ్ ఆమె.. శిక్షణ ఆయనకు..!

సర్పంచ్ ఆమె.. శిక్షణ ఆయనకు..!
మహిళలకు ఏర్పాటు చేసిన తరగతుల్లో భర్తల హాజరు
గంగాదేవిపల్లిలో జరుగుతున్న ఐదు రోజుల శిక్షణలో విచిత్రం
పంచాయతీ పాలనలో కుటుంబ జోక్యం
అధికారుల సమక్షంలోనే నిబంధనల ఉల్లంఘనపై చర్చ
మహిళా ప్రజాప్రతినిధుల సాధికారత లక్ష్యానికి దెబ్బ
చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

కాకతీయ, దుగ్గొండి : మహిళా సర్పంచ్‌లు స్వతంత్రంగా గ్రామ పాలన నిర్వహించి నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా, ఆ తరగతులకు మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు హాజరవుతున్న ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మహిళా ప్రజాప్రతినిధులు స్వయంగా పంచాయతీ చట్టాలు, పరిపాలనా విధానాలు నేర్చుకుని గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ సత్య శారదా ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ శిక్షణా కార్యక్రమం ఉద్దేశానికి విరుద్ధంగా మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు హాజరవడం విస్మయానికి గురిచేస్తోంది. మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, గ్రామ ఫస్ట్ సిటిజన్‌గా గౌరవం పొందాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఇతరుల జోక్యం వల్ల మహిళలు పరిపాలనలో చురుకుదనం కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

శిక్షణలో భర్తల హాజరుపై సందేహాలు

వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి గ్రామంలో జిల్లాలోని మూడు మండలాలకు చెందిన సర్పంచ్‌లకు మూడవ విడత శిక్షణ కొనసాగుతోంది. ఈ శిక్షణలో భాగంగా తాగునీటి నిర్వహణ, పారిశుద్ధ్యం, గ్రామ రహదారులు, విద్య, వైద్యం, హాస్టళ్లు, కస్తూర్బా, రెసిడెన్షియల్ పాఠశాలల పరిశీలన, ప్రభుత్వ భూముల సంరక్షణ, గ్రామాభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఒక మండలానికి చెందిన మహిళా సర్పంచ్‌లకు బదులుగా వారి భర్తలు గత రెండు రోజులుగా ఈ శిక్షణా తరగతులకు హాజరవుతున్నట్లు వెల్లడైంది. ఇది అధికారులకు తెలిసే జరుగుతోందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే మండలానికి చెందిన అధికారులు శిక్షణ ఇస్తుండగా కూడా మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు పాల్గొనడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మహిళా సాధికారతపై ప్రభావం

ప్రభుత్వం మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ పంచాయతీ రిజర్వేషన్లు అమలు చేసి, గ్రామ పాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రయత్నిస్తోంది. అయితే అధికారిక శిక్షణా కార్యక్రమాల్లోనే మహిళల స్థానంలో కుటుంబ సభ్యులు పాల్గొనడం మహిళా సాధికారత లక్ష్యానికి విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే ఇలా జరిగితే గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం ఎంత మేర ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మహిళా సర్పంచ్‌లే స్వయంగా శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని, మహిళా ప్రజాప్రతినిధుల పరిపాలనా స్వాతంత్ర్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.