epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కారేపల్లిలో ‘మంచి దొంగ’

కారేపల్లిలో ‘మంచి దొంగ’
పేదోడి కన్నీరు చూసి కరిగిన దొంగ మనసు
దోచుకున్న బంగారం, వెండి, నగదు గుమ్మం ముందు పెట్టివెళ్లిన వైనం
బాధిత కుటుంబంలో ఆనంద భాష్పాలు
అసలు కారణం ఏంటి? దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

కాకతీయ, కారేపల్లి: కఠినంగా మారిపోయిందనుకుంటున్న కాలంలో మానవత్వం మళ్లీ మెలుకువ వచ్చిందనిపించే ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తులు, పేద కుటుంబం ఆవేదన చూసి మనసు మార్చుకుని దోచుకున్న సొత్తును తిరిగి యజమాని గుమ్మం వద్దే ఉంచి వెళ్లడం గ్రామంలో చర్చనీయాంశమైంది. చీమ్న తండాకు చెందిన గుగులోత్ వీరు సాధారణ కూలీ. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న తులం బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, 10 వేల రూపాయల నగదు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అది కేవలం సొమ్ము కాదు, ఆ కుటుంబం భవిష్యత్తు. సర్వస్వం కోల్పోయామనే బాధతో కుటుంబం కన్నీటి పర్యంతమవ్వడం గ్రామస్తులను కలచివేసింది. దొంగతనం జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం అర్ధరాత్రి నిశ్శబ్దంగా అదే ఇంటి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు, దోచుకున్న సొత్తును ఒక కవర్‌లో భద్రంగా చుట్టి గుమ్మం ముందు ఉంచి వెళ్లిపోయారు. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు తమ సొత్తు తిరిగి రావడంతో ఆశ్చర్యంతో పాటు ఆనంద భాష్పాలు కార్చారు. ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బాధితుల పేదరికం చూసి దొంగల మనసు కరిగిందా? లేక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో దొరికిపోతామనే భయంతో తిరిగి ఇచ్చేశారా? లేక గ్రామంలో అనుమానాలు పెరగడంతో పరిచయస్తులే మనసు మార్చుకున్నారా? అన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొత్తు తిరిగి వచ్చినా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. “మా కష్టం మాకు తిరిగి వచ్చింది” అంటూ బాధిత కుటుంబం దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. నేరం నేరమే అయినా, నేరస్థుల్లో మిగిలిన ఈ కొద్దిపాటి మానవత్వం గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.