epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కలెక్టరేట్‌లో అధికారుల‌తో సమీక్ష సమావేశం

ఐదు దశల్లో 10 కీలక అంశాల అమలు

రోజువారీ ప్రగతి నివేదికలు.. నోడల్ అధికారుల నియామకం

కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అమలు విధానంపై విస్తృతంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు పది ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి అంశానికి స్పష్టమైన లక్ష్యాలు, సమయపట్టికలు నిర్ధేశించి అమలు చేయాలని సూచించారు.

పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కరణపై ప్రత్యేక దృష్టి

మార్చి 6 నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్ల పరిష్కరణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యాలయాల పరిశుభ్రత, రికార్డుల సక్రమ నిర్వహణ, పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, ప్రజలకు సమయానుకూల సేవలందించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించినట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లో 100 శాతం పన్ను వసూళ్ల లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు అంశంపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు, చిన్నారుల పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.

సంక్షేమం.. పిల్లల భద్రత

ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 25 వరకు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాల అమలు స్థితిపై సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్‌కు నో కార్యక్రమాన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన రూపంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. మే 4 నుండి మే 9 వరకు వ్యవసాయ అంశంపై వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో రైతులకు సాగు సలహాలు, ఎరువులు, విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మే 11 నుండి మే 16 వరకు విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 18 నుండి మే 23 వరకు యువత క్రీడలు అంశంపై క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు చేపట్టాలని సూచించారు.

మహిళా సాధికారత.. పర్యావరణ పరిరక్షణ

మే 25 నుండి మే 30 వరకు మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుండి జూన్ 12 వరకు పర్యావరణ పరిరక్షణ అంశంపై వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు నిర్వహించనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ అనుజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి (రెవెన్యూ), వై.వి. గణేష్ (లోకల్ బాడీస్), డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈవో రామ్ రెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్న రాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీవోలు ఉమారాణి, సుమ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.*

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.