epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం గద్దెల వద్ద ప్రమాదం…

మేడారం గద్దెల వద్ద ప్రమాదం…
పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు…
నిర్మాణాల నాణ్యతపై విమర్శలు…
ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు….

కాకతీయ, ములుగు ప్రతినిధి: తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. గద్దెల పరిసరాల్లో నిర్మించిన రాతి దిమ్మలు అకస్మాత్తుగా కూలిపోవడంతో సమ్మక్క ప్రధాన పూజారి కుటుంబానికి చెందిన బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన రానా రమేష్ కుమారుడు యువన్ (6) గద్దెల వద్ద ఆడుకుంటుండగా, అక్కడ ఏర్పాటు చేసిన రాతి దిమ్మలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో బాలుడి కాలు రెండు చోట్ల విరిగినట్లు సమాచారం. అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు.

నాసిరకం పనులపై ఆరోపణలు…

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక స్థలంలో నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల నిర్మించిన రాతి కట్టడాలు బలహీనంగా ఉన్నాయని విమర్శలు

కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు
పర్యవేక్షణలో అధికారులు విఫలమయ్యారని స్థానికుల ఆవేదన

గాయపడిన బాలుడికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలి-
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన సురేందర్.

ప్రభుత్వ పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, గాయపడిన బాలుడికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.

మేడారం పనులపై సిట్ విచారణ చేపట్టాలి-బీఆర్‌ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న.
ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, వందేళ్ల కట్టడాలు అంటూ చెప్పిన నిర్మాణాలు వంద రోజులు కూడా నిలవలేదని, కాంట్రాక్టర్లకు పనులు వదిలేసి నాణ్యతను పట్టించుకోలేదని, భక్తుల ప్రాణాల కంటే కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని, మేడారం పనులపై సిట్ విచారణ చేపట్టాలి అని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.

అధికారుల మౌనం.

ఈ ఘటనపై సంబంధిత శాఖల అధికారులు ఇంకా అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈ ఘటన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్నారి గాయపడిన ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.