డీసిల్టేషన్ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
జవహర్ కాలనీ, రాజీ నగర్ తదితర ప్రాంతాల్లో నాల పరిశీలన
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: హన్మకొండ నగర పరిధిలో నాల డీసిల్టేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఆమె జవహర్ కాలనీ, ప్రెసిడెంట్ స్కూల్, రాజీ నగర్, నయీమ్ నగర్ ప్రాంతాల్లోని నాలను నేరుగా పరిశీలించారు. డీసిల్టేషన్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, మిగిలి ఉన్న చిన్నపాటి పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
అవసరమైన చోట్ల లోతుగా డీసిల్టేషన్ చేపట్టి వర్షాకాలంలో నీటి నిల్వ, పారుదల సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఈఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

