epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిజం ‘నిమ్మల’౦గా బ‌య‌ట‌కు

నిజం ‘నిమ్మల’౦గా బ‌య‌ట‌కు
మార్కెటింగ్ శాఖ జేడీ శ్రీనివాస్‌పై స‌స్పెన్ష‌న్ వేటు
అవినీతి ఎప్పటికైనా బయటపడక తప్పదంటూ మార్కెట్ లో చర్చ
వరంగల్ జిల్లాలో శ్రీనివాస్ హయాంలో అనేక అక్రమాల ఆరోపణలు
సీసీఐ కొనుగోళ్లలో పెద్దమొత్తం అవినీతి జ‌రిగిన‌ట్లు విమ‌ర్శ‌లు
పంట అంచనాలకు మించి రికార్డుల్లో సరుకు నమోదైనట్లు విచార‌ణ‌లో గుర్తింపు
ఇదే అంశంలో గతంలోనే 105మందికి మెమోలు జారీ.. ఏడుగురు సస్పెన్షన్
తాజాగా, అప్పటి జేడీగా కొనసాగిన ఉప్పల శ్రీనివాస్‌పైనా చ‌ర్య‌లు
సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ
ఆ 105 మంది వివరణలో చెప్పింది శ్రీనివాస్ పేరేనా?
లేదంటే ఉప్పందించింది ఆ ఏడుగురా?

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వంద తప్పు చేసే దాకా నాడు శిశుపాలుడికి శ్రీకృష్ణుడు సమయం ఇచ్చాడట! నేడు తెలంగాణ మార్కెటింగ్ శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు నాటి శిశుపాలుడి తీరుకు అద్దం పడుతున్నాయా? అన్నట్లుగా అనిపిస్తోంది. నిజం నిమ్మలంగా బయటపడుతుందన్నట్లుగా సదరు ఉన్నతాధికారి వరంగల్ జిల్లాలో పని చేసిన సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అవినీతి ఊడలు పెకిలించే క్రమంలో సదరు అధికారిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు మార్కెటింగ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

మార్కెటింగ్ శాఖ మాజీ జేడీపై అవినీతి ఉచ్చు!

ఉప్పల శ్రీనివాస్ వరంగల్ మార్కెటింగ్ శాఖ జేడీగా పని చేసిన సమయంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీసీఐ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లో చర్చ జరిగింది. గుడ్డి పత్తిని కూడా దళారుల ద్వారా కొనిపించి.. సీసీఐ చేత మద్దతు ధర పెట్టించిన బాగోతంలో ఉప్పల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, వ్యవసాయ శాఖ అంచనాలకు మించి.. రికార్డుల్లో పత్తి దిగుబడి అయినట్లు చూపడం, ఆ రికార్డుల్లో కొన్ని పత్రాలను మాయం చేసినట్లు అప్పట్లో చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారాన్ని మార్కెటింగ్ శాఖ స్వయంగా గుర్తించి.. రెండేళ్ల క్రితం చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా 105మంది మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి మెమోలు జారీ కావడం, ఏడుగురు అధికారులు సస్పెన్షన్ కు గురికావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

వారు అందించిన ఉప్పేనా?

ఈ అవినీతి బాగోతం వెనక అప్పటి మార్కెట్ జేడీ ఉప్పల శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే, ముందస్తుగా మేల్కొన్న ఉప్పల శ్రీనివాస్.. తన మీదకు రాకుండా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరిగింది. నిజం నిలకడ మీద బయటకొస్తుందన్నట్లుగా.. తమ వెనక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించినట్లు.. మెమోలు అందుకున్న 105మంది, సస్పెన్షన్కు గురైన ఏడుగురు తమ వివరణలో ప్రభుత్వానికి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ఆయన్ను జేడీ బాధ్యతల నుంచి తప్పించి.. హైదరాబాద్ కార్యాలయానికి పరిమితం చేసినట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాస్త.. ఆలస్యమైనా చివరకు ఆయనపైనా సస్పెన్షన్ వేటు పడడంతో అసలు అవినీతి బాగోతం బయటపడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే ఆయన వెంట మరికొందరు కూడా ఉన్నారని, వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు కుడిభుజంగా పని చేసిన ఓ గ్రేడ్ 2 కార్యదర్శిపై చర్యలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జేడీఎంగా ఉన్న లక్ష్మణుడు.. సదరు గ్రేడ్ 2ను ఇప్పటికే సాధారణ విధులకు పరిమితం చేసినట్లుగా తెలుస్తుండగా, తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయనే ఆందోళనలో మార్కెట్ వర్గాలు ఉండడం గమనార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.