యువతి అదృశ్యం.. కేసు నమోదు
కాకతీయ, గీసుకొండ : గీసుకొండ మండలం హర్జాతండాకు చెందిన బానోతు కీర్తన (18) అదృశ్యమైనట్లు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు. ఈ నెల 3న రాత్రి అమ్మమ్మ బాదావత్ బాలమ్మతో కలిసి నిద్రించిన కీర్తన.. రాత్రి 11.30 గంటలకు ఇంట్లో కనిపించలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన సమయంలో కీర్తన ఆకుపచ్చ టాప్, ఎరుపు ప్యాంటు ధరించి ఉందని, ఎత్తు సుమారు 5.5 అడుగులు, ఛాయ తెలుపుగా ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

