కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై ఇనుప రాడ్‌తో దాడి
మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు
తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచిన గుర్తుతెలియని వ్యక్తులు
తీవ్రంగా గాయపడిన వేలేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్
కాకతీయ, స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం వేలేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఆయనను సాయిపేట–కేశవనగర్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు అడ్డుకున్నట్లు సమాచారం. అనంతరం ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో లక్ష్మణ్ నాయక్ కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. గాయపడిన లక్ష్మణ్ నాయక్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి బాధితుడు లక్ష్మణ్ నాయక్‌ను ఎంజీఎంలో పరామర్శించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి గల కారణాలు, దుండగుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

