మోదీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపు
కాకతీయ,వరంగల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వరంగల్ జిల్లావ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సత్యం కన్వెన్షన్ హాల్‌లో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కార్యశాల జరిగింది. జిల్లా కన్వీనర్ డాక్టర్ రాణా ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవ హీ ప్రభు సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గంట రవికుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ప్రజా సేవను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. జిల్లా కన్వీనర్ డాక్టర్ రాణా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అభియాన్ విజయవంతానికి రూట్‌మ్యాప్ సిద్ధం చేశామన్నారు. రక్తదాన శిబిరాలు, ఆశీర్వాద దీపం, పారిశుధ్య కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కో-కన్వీనర్లు గార్లపాటి మంజులరెడ్డి, పొనుగోటి వెంకట్‌రావు, ఎర్రగొల్ల భరత్‌వీర్, చిలువేరు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్‌షా, జలగం రంజిత్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు టేకుమట్ల రేణుక, నాయకులు బైరి శ్యాంసుందర్, గుర్రాల చంద్రమౌళి, తక్కల్లపల్లి అమృతరావు, కట్ల రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షులు, కో-కన్వీనర్లు పాల్గొన్నారు.

