టీపీటీఎఫ్ సభ్యత్వానికి వేముల ప్రకాష్ రాజీనామా
పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరిన ఉపాధ్యాయుడు
కాకతీయ, పెద్దవంగర : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి పనితీరుకు ఆకర్షితులై ఉపాధ్యాయుడు వేముల ప్రకాష్ పీఆర్‌టీయూ టీఎస్ సంఘంలో సభ్యత్వం తీసుకున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షులు గంగిశెట్టి రమేష్‌కుమార్ తెలిపారు. టీపీటీఎఫ్ సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పీఆర్‌టీయూ టీఎస్‌లో చేరినట్లు చెప్పారు. టీచర్స్ బడి వెబ్‌సైట్ ద్వారా ఉపాధ్యాయులకు సేవలు అందించిన వేముల ప్రకాష్ చిట్టి జాబిలి ఛానెల్ సృష్టికర్తగా, టీఎల్‌ఎం మేకర్‌గా, వర్క్‌షీట్ రూపకర్తగా సేవలందిస్తున్నారని రమేష్‌కుమార్ వివరించారు. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘమైన పీఆర్‌టీయూ టీఎస్ ద్వారానే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమవుతాయనే విశ్వాసంతో సంఘంలో చేరినట్లు వేముల ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా, సభ్యులు యాకూబ్‌రెడ్డి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

