epaper
Sunday, October 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి

దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి
ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులా?
మోదీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం
రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వి. హ‌నుమంత‌రావు

కాకతీయ, హైదరాబాద్ : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించేందుకు పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని వి.హెచ్. పిలుపునిచ్చారు. ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘాన్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో హనుమంత‌రావు విలేక‌రుల‌తో మాట్లాడారు. దేశంలో ఇంతటి నియంతృత్వ పాలనను ఎక్కడా చూడలేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీలో గత 4 రోజులుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉద్యమాలు జరుగుతున్నాయని తెలిపారు. 13 కోట్ల ఓట్లను రద్దు చేశారని ఆరోపిస్తూ, ఈ అంశంపై ఎన్నికల కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నించినా అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై సవరణలు చేయాలని కోరితే అరెస్టులకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎంపీలతో పాటు జనతాదళ్ పార్టీ నాయకులను కూడా అరెస్టు చేశారని వి.హెచ్. అన్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని సైతం అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీని అప్రతిష్ఠపాలు చేశారని, ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ అంతకంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాలుగోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మోదీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేయాలని వి.హెచ్. కోరారు. ఎన్టీఆర్ బీసీల అభ్యున్నతి కోసం పనిచేశారని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో చంద్రబాబు పార్టీ మద్దతుతోనే మోదీ ప్రభుత్వం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 100 రోజుల పాటు బీసీ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఓబీసీ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తామని ప్రకటించారు. భావితరాల భవిష్యత్తు కోసం బీసీలు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమై రిజర్వేషన్లు సాధించాలని, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వి.హెచ్. పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి 13 కోట్ల ఓట‌ర్ల‌ పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన ఢిల్లీ...

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు ఈ నెల 27, 28,...

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే పట్టభద్రుల ఆశయాలను...

కానిస్టేబుల్‌ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర

కానిస్టేబుల్‌ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకతీయ,...

ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు విమానాశ్రయం నుంచి వస్తున్న వాహనాల్లో మద్యం బాటిళ్ల తనిఖీ రెండు...

గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి..

గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు పరుగులు పెట్టించాలి.. గౌరవెల్లి...

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ టీసీయూఆర్‌ పరిధిలో ముందస్తు అనుమతులకు ఆహ్వానం కాకతీయ, హైదరాబాద్...

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.