epaper
Tuesday, October 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!
ఒకే తరహా కథనాలకే ప్రాధాన్యం ఇవ్వొద్దు
పాత వీడియోలు, ఫొటోల వెనుక వాస్తవాలు వెల్లడించాలి
హింసను ప్రేరేపించే కంటెంట్‌పై నిఘా పెంచాలి

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా వేదికలపై వార్తలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా తన కంటెంట్‌ సిఫార్సు, ర్యాంకింగ్‌ వ్యవస్థలను సమీక్షించాలని ఆదేశించింది. ఒకే తరహా కథనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా, విశ్వసనీయ సమాచారంలోని విభిన్న కోణాలు వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అక్టోబర్‌ 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ మెటాకు అడ్వైజరీ జారీ చేసింది. ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్‌ను ప్రదర్శించేటప్పుడు వాటి నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేయాలని కేంద్రం పేర్కొంది. అవి ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో, ప్రస్తుత ఘటనలకు సంబంధం ఉందో లేదో వినియోగదారులకు అర్థమయ్యేలా వివరాలు అందించాలని సూచించింది. పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చూపడం, అత్యవసర పరిస్థితులు, ఆంక్షలు, పోలీసుల చర్యలపై ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు, ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.

హింసను ప్రేరేపించే కంటెంట్‌పై నిఘా

తప్పుదారి పట్టించేలా మార్పులు చేసిన లేదా అసలు సందర్భం నుంచి వేరు చేసి చూపించే కంటెంట్‌ను పదేపదే సిఫార్సు చేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. హింసను ప్రేరేపించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీసే సమాచారాన్ని వేగంగా గుర్తించి, పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునే వ్యవస్థలను బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ప్రజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ప్రకటనలు, గ్రాఫిక్స్‌ను తగిన వివరణ లేకుండా విస్తృతంగా ప్రదర్శించడంపైనా ఆందోళన వ్యక్తం చేసింది.

దిల్లీ నిరసనల వేళ అడ్వైజరీ

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న నిరసనల నేపథ్యంలో కేంద్రం సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్న సమయంలో మెటా అల్గారిథమ్‌లు కొన్ని రకాల కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయనే అంశం చర్చకు వచ్చినట్లు ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సమాచార సాంకేతిక చట్టం–2000, సమాచార సాంకేతిక నిబంధనలు–2021 ప్రకారం మెటా వ్యవహరించాలని కేంద్రం స్పష్టం చేసింది. పోలీసులు, ఇతర అధికారిక సంస్థలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని సూచించింది. తక్షణమే చర్యలు చేపట్టి, వాటి వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని కోరింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు!

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు! విజయ్‌ పార్టీకి నలుగురు దాతల...

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం!

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం! సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజల...

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు భర్త హత్య కేసులో భార్య,...

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం దీప్కే నిర్బంధంలో.. అజింక్య శిందేకు బాధ్యతలు సీఈసీ...

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌!

కేరళ మాజీ సీఎం విజయన్‌కు హైకోర్టులో షాక్‌! కుమార్తె సంస్థ చెల్లింపులపై ఎఫ్‌ఐఆర్‌కు...

మోదీకి కేబినెట్‌ అభినందనలు

మోదీకి కేబినెట్‌ అభినందనలు గుజరాత్‌ నుంచి దేశ నాయకత్వం వరకు 25 ఏళ్ల...

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు ఆమోదం

బ్రిక్స్‌ డిక్లరేషన్‌కు ఆమోదం భారత్‌ దౌత్యంతో ఇరాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా అంగీకారం చివరి...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.