epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’
నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం
రెండు రోజుల పాటు 50కి పైగా కార్యక్రమాలు
రోబోటిక్స్‌, సైబర్‌ భద్రత, స్టార్టప్‌ ఛాలెంజ్‌లతో సందడి
అక్టోబర్‌ 30, 31 తేదీల్లో వేడుకలు
ప్రారంభోత్సవానికి ఈవీ రంగ నిపుణుడు కమల్‌ కిషోర్‌ వోరా
విద్యార్థుల సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయి వేదిక

కాకతీయ, వరంగల్ : విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా తృష్ణ, సృజనాత్మక ఆలోచనలను వెలికితీసే లక్ష్యంతో ఎన్‌ఐటీ వరంగల్‌ నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియన్‌–26’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్‌ 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు క్యాంపస్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. రోబోటిక్స్‌, సైబర్‌ భద్రత, స్టార్టప్‌ ఆలోచనలు, సాంకేతిక ప్రదర్శనలతో విద్యార్థులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించనున్నారు.
ఎన్‌ఐటీ వరంగల్‌లో 2006లో ప్రారంభమైన టెక్నోజియన్‌ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఆకర్షిస్తున్న సాంకేతిక ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతాలను వాస్తవ ప్రపంచ సమస్యలకు అన్వయించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. రోబోటిక్స్‌, కృత్రిమ మేధ, విద్యుత్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో విద్యార్థుల ఆలోచనలకు వేదికగా నిలుస్తోంది.

ఉదయం 9.30 గంటలకు ప్రారంభం

అక్టోబర్‌ 30న ఉదయం 9.30 గంటలకు ఇన్‌స్టిట్యూట్‌లోని అకడమిక్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో ఉత్సవం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ఒలెక్ట్రా వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇన్నోవేషన్‌ అండ్‌ స్ట్రాటజీ పార్ట్‌నర్‌షిప్‌), అతుల్‌ ఆటో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌, ఏఆర్‌ఏఐ మాజీ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌, విద్యుత్‌ వాహనాల నిపుణుల బృంద సభ్యుడు కమల్‌ కిషోర్‌ వోరా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్‌ఐటీ వరంగల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి విశిష్ట అతిథిగా పాల్గొంటారు. రెండు రోజుల వేడుకల్లో 50కి పైగా సాంకేతిక పోటీలు నిర్వహించనున్నారు. రోబోటిక్స్‌ పోటీలు, కొత్త వ్యాపార ఆలోచనలకు ఊతమిచ్చే స్టార్టప్‌ ఛాలెంజ్‌, సైబర్‌ భద్రతపై ప్రతిభను పరీక్షించే హ్యాకథాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవాన్ని అందించే వర్క్‌షాప్‌లు, సాంకేతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఆవిష్కర్తలు ఇందులో పాల్గొననున్నారు.

విద్యార్థుల సమన్వయంతో ఏర్పాట్లు

ఎన్‌ఐటీ స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ కె. కిరణ్‌ కుమార్‌ (డీన్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌), ప్రొఫెసర్‌ వెలగపూడి వాసు (ప్రెసిడెంట్‌, ఎస్‌ఏసీ), ప్రొఫెసర్‌ వెంకన్న ఉడుతలపల్లి (వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నికల్‌) పర్యవేక్షణలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థి మండలి టెక్నికల్‌ సొసైటీ కార్యదర్శి ధీరజ్‌ బి., సంయుక్త కార్యదర్శి విష్ణు వర్ధన్‌ నేతృత్వంలోని విద్యార్థి బృందం ఏర్పాట్లను సమన్వయం చేసింది. పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం technozion.nitw.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు!

మోహన్‌ గ్రానైట్‌ క్వారీ మూసివేతకు ఆదేశాలు! లీజు గడువు ముగిసినా కొనసాగుతున్న తవ్వకాలు తండావాసుల...

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం!

పర్యాటకమే ప్రాణం.. ఓరుగల్లు కీర్తే లక్ష్యం! చరిత్రను పరిచయం చేస్తూ.. వారసత్వ సంపదకు...

భూ గ‌ద్ద‌లు

భూ గ‌ద్ద‌లు కాజీపేట‌లో భూ గోల్‌మాల్‌ వైఎస్సార్ న‌గ‌ర్ గుడిసెల‌పై భూదందా నీడ! వంద‌ల కోట్ల...

ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై అవగాహన తక్కువ నీటితో...

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం

ఏక్తా దివస్‌ రన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల ఉత్సాహం 5కే, 10కే పరుగుల్లో వందమంది...

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి బాలికల గురుకులంలో ప్ర‌త్యేకాధికారి అనురాధ ఆకస్మిక తనిఖీలు ఆహార...

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌

పంచాయతీల్లో నిధులు గోల్‌మాల్‌ ములుగు జిల్లా పంచాయ‌తీల్లో అవినీతి బాగోతం చెల్లింపుల్లో అక్రమాలు.. రికార్డుల్లో...

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.