రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర సలహాదారుగా కొమురయ్య పటేల్
వరంగల్ మండల సీనియర్ డీలర్‌కు కీలక బాధ్యత
కాకతీయ, వరంగల్: తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుగా వరంగల్ మండలానికి చెందిన సీనియర్ డీలర్ మాడిశెట్టి కొమురయ్య పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకంపై సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్ మండల అధ్యక్షుడు గజ్జి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, కోశాధికారి బసవరాజు సాంబయ్య, షబ్బీర్ అలీ, పగిడ ధర్మారావు, మాడిశెట్టి చంద్రశేఖర్ పటేల్, శ్రీరామ్ నారాయణ, వేణు, లక్కసు రాజు హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ డీలర్‌గా ఉన్న అనుభవంతో రేషన్ డీలర్ల సంక్షేమానికి కొమురయ్య పటేల్ కృషి చేయాలని ఆకాంక్షించారు. పలువురు డీలర్లు శుభాకాంక్షలు తెలిపారు.

